Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు గడ్డ గులాబీ అడ్డా
- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, గులాబీ జెండా ఎగురుతుందని, కేసీఆరే ముఖ్యమంత్రి అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 8,9,10 వార్డుల్లో పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. లక్కారం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను అన్నింటిని పరిష్కారం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సహకారంతో నిధులు తీసుకువచ్చి మునుగోడు ప్రాంతాన్ని మరింత అభివద్ధి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి మునుగోడు ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారని, ఇందులో భాగంగానే 20 కోట్ల రూపాయలు మంజూరుచేశారని, మరో 50 కోట్ల రూపాయలు మంజూరుచేయనున్నట్టు తెలిపారు. ఈ నిధులతో చౌటుప్పల్ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులు, ఇతర సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. మునుగోడు గడ్డ గులాబీ అడ్డ అన్నారు. ఈ ప్రాంత అభివద్ధే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, సీపీఐ(ఎం) ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, కౌన్సిలర్లు దండ హిమబిందు అరుణ్‌కుమార్, బొడిగె అరుణబాలకష్ణగౌడ్, కొయ్యడ సైదులుగౌడ్, కాసర్ల మంజులశ్రీనివాస్రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ ఉడుగు మల్లేశ్‌గౌడ్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మార్కెట్ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాశం సంజరుబాబు, ఎమ్‌డి.ఖయ్యుమ్పాషా, దేప రాజు, కానుగు బాలరాజు, దేవరపల్లి గోవర్థన్‌రెడ్డి, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, శ్రీరాములుగౌడ్, గంగరాములు, సుర్కంటి బలరామ్‌రెడ్డి, రఘుపతి పాల్గొన్నారు.