Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క కేసీఆర్ తోనే దేశ అభివృద్ధి సాధ్యం
- పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
- బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపిన ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ , బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి , జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం గోదాము ఆవరణలో నిర్వహించిన ఆ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి , భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. చందుపట్ల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం గోదాము ఆవరణలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులు అతిథులకు డప్పు చప్పుల్లు , కోలాటాలుతో , బోనాలతో , బాణాసంచ కాలుస్తూ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పది ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో మన కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. నడి ఎండ కాలంలో కాలువలలో నిండుగా నీళ్లు ఎప్పుడన్నా పోయినయా. ఇంటింటికి నల్లా నీళ్లు వచ్చినయా ప్రజలు ఆలోచించాలని కోరారు. మూడు ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు.. కేంద్రంలోని బీజేపీ పార్టీ చేస్తున్న నీతిమాలిన రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదెండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణా రాష్ట్రానికీ మరో సారి కెసిఆర్ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న విధివిధానాలను బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం టోల్గేట్ చార్జీలు , కరెంట్ చార్జీలు అతిగా పెంచడం దారుణమన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సమక్షమంలో కోంత మంది చేరారు. ఈసందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ గ్రామలలో పెండింగ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు , సీసీరోడ్లు, సెంట్రల్ లైటింగ్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు , మండల ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, ర్యాకల శ్రీనివాస్, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్ , మండల రైతు సమన్వయ సమితి సభ్యులు కంచి మల్లయ్య ,చందుపట్ల బ్యాంకు మాజీ చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మెన్ నల్లమాసు రమేష్ గౌడ్, కటిక జంగయ్య యాదవ్, అబ్బా గాని వెంకటేష్ గౌడ్ , చందుపట్ల సర్పంచ్ చిన్నం పాండు , ఎంపీటీసీలు బోక్క కోండల్ రెడ్డి, కంచి లలిత మల్లయ్య ,రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, ర్యాకల శ్రీనివాస్, గౌరారం నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు , ఉపసర్పంచులు , ఎంపీటీసీలు , గ్రామ శాఖ అధ్యక్షులు , కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.