Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బొమ్మలరామారం
నిత్యం పదుల సంఖ్యలో రాక పోకలు సాగించే వాహనాలతో రద్దీగా ఉండే రహదారి శిథిలమైంది. దారంతో గుంతులుగా మారి రాకపోకులకు ప్రమాదకరంగా మారింది. మండలంలోని చీకటిమామిడి నుండి మర్యాల గ్రామం వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఇక్కడ నుండి భారీ వాహనాలు పోవడంతో రోడ్డు పాడయింది. ఈ మార్గం మీదనే నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి.ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు.రాత్రి సమయంలో ప్రయాణం చేయాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఈ దారి వెంట నడుస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.