Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-సూర్యాపేట
మహనీయులు జ్యోతిబాఫూలే, అంబేద్కర్ల స్ఫూర్తితో మనువాదాన్ని మట్టు పెడదాం- రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఈ నెల 16 నుండి 19 వరకు జిల్లా వ్యాప్తంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రాజ్యాంగ రక్షణ యాత్రలను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎంవిఎన్ భవనంలో రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను ఆయన విడుదల చేసి మాట్లాడారు.కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్నే ధ్వంసం చేయాలని కుట్ర చేస్తున్నాడన్నారు. రాజ్యాంగంలో దళితులకు పొందుపరిచిన హక్కులు, చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తున్న మోడీ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా పాలన చేస్తూ రిజర్వేషన్లను తొలగించాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా జరుగు ఈ యాత్రలో అన్ని సామాజిక, ప్రజా సంఘాలు మద్దతుతెలిపి యాత్ర విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కెవీపీఎస్ జిల్లా నాయకులు ఒగ్గు సైదులు, బొజ్జ శ్రీను పోలేపాక శ్రీనివాస్ యాతాకుల వెంకన్న, నరసయ్య,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.