Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
మునగాల గ్రామంలో గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ 88వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవవరం వెంకటరెడ్డి అవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్ప చెప్పాలని చేసిన ప్రయత్నాన్ని రైతాంగ సంఘాలు తిప్పికొట్టాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు దేవరం శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం వెంకన్న, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్, రైతులు పాల్గొన్నారు.
కొక్కిరేణిలో....
మండలంలోని కొక్కిరేణి గ్రామంలో గురువారం అఖిల భారత కిసాన్ సభ 88 వ వార్షికో త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కెేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సై దులు, రైతు సంఘం గ్రామ అధ్యక్షులు రావులపెంట వెంకన్న, ఉపసర్పంచ్ రా వులపెంట బ్రహ్మం, జయరాజు, వెంకన్న, శ్రీరాములు, సైదులు, పాల్గొన్నారు.
చిలుకూరు : ఏనాటికైనా అన్యాయాన్ని ఎదిరించేది కమ్యూనిస్టులే అని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని బేతవోలు గ్రామంలో అఖిలభారత రైతు సంఘం 88వ వార్షికోత్సవం సందర్భంగా చిలుకూరు మండల రైతు సంఘం అధ్యక్షులు ఎగ్గడి లింగయ్య మొదట పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలను ప్రోత్సహిస్తున్నారని, అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఇంటికి పంపించాలని లేనియెడల భారతదేశం అదోగతి పాలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాగాటి చిన్న రాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారసాని వెంకటేశ్వర్లు గట్టు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : టీఎస్ యుటిఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం మండలకేంద్రంలో ఆ సంఘం సీనియర్ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు ఓరుగంటి అంతయ్య పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. ఉపాధ్యాయుల పక్షాన నిలబడి అలుపెరుగని పోరాటం చేస్తుందన్నదన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేము రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్, విశ్రాంత ఉపాధ్యాయులు జోగునూరి దేవరాజ్, మండల నాయకులు భీవనపల్లి శ్రీనివాస్, పాలకుర్తి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
హుజూర్ నగర్ : కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని రైతు సంఘం నాయకులు కంబాల శ్రీనివాస్ కొప్పూజు సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జెండాలు ఎగరవేసే కార్యక్రమంలో భాగంగా యూపీఎస్ నెంబర్ వన్ పాఠశాల ముందు జెండా ఎగరవేసిన అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పొనుగుపాటి వాసుదేవరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, దేవారం మల్లేశ్వరి, పార్టీ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వరు,్ల దొంత గాని సత్యనారాయణ, సోమ గాని కృష్ణ వెంకన్న, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.