Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
రైతాంగ పోరాటంలో అఖిల భారత కిసాన్ సభ ది చారిత్రాత్మకమైన పోరాటమని అఖిలభారత కిసాన్ కౌన్సిల్ సభ్యురాలు కందాల ప్రమీల అన్నారు. ఏఐకేఎస్ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఎన్ఆర్ భవనంలో ఏఐకేఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం స్వాతంత్రానికి పూర్వం 1936 లోనే ఏఐకేఎస్ ఏర్పడిందని పేర్కొన్నారు. ఓ పక్క రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే స్వాతంత్ర పోరాటంలోనూ విరోచితంగా పోరాడిందని, నేటికీ రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉందని పేర్కొన్నారు. ఇటీవలే ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలపై జరిగిన పోరాటంలో ఏఐకేఎస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. పార్లమెంటులో రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టం తేవాలని, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. అనేకరకాలుగా రైతాంగ సమస్యలపై పోరాడుతున్న అఖిల భారత కిసాన్ సభలో ప్రజలు విస్తృతంగా చేరి సమస్యల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల అధ్యక్షులు వెంకట రంగారెడ్డి, రైతు సంఘం, గీత సంఘం రాష్ట్ర నాయకులు రాచకొండ వెంకట్‌గౌడ్, యానాల కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు బచ్చుపల్లి ప్రకాష్ రావు, రైతు సంఘం జిల్లా నాయకురాలు గింజల లక్ష్మి, ఉపాధ్యక్షురాలు గురుజ, స్వరూప, ప్రజా సంఘాల నాయకులు లక్ష్మీ నరసయ్య, ఇందిరా, నాగమణి, శశికళ, జయమ్మ, నాగయ్య పాల్గొన్నారు.
నాంపల్లి : రైతాంగ పోరాటంలో అఖిల భారత కిసాన్ సంగ్ (ఏఐకేఎస్ )ది చారిత్రాత్మకమైన పోరాటమని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి అన్నారు. గురువారం ఏఐకేఎస్ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి మండలం పస్నూరు గ్రామంలో ఏఐకేఎస్ జెండా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం ఎగరవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల నాయకులు సిహెచ్.రామకృష్ణ, చిన్న ముత్తయ్య, వీ.గోవర్ధన్, వీ.లింగయ్య, యాదమ్మ, వెంకమ్మ, బుచ్చమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము లక్ష్మయ్య, ముఖేష్, వెంకటయ్య, సైదమ్మ, భారతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి : మండలంలోని ఇందుగుల గ్రామంలో ఆల్ ఇండియా కిసాన్ సంగ్ ఆవిర్భావ దినోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు దేవిరెడ్డి అశోక్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ముందుగా సీనియర్ రైతు సంఘం నాయకులు మద్దికుంట్ల దామోదర్‌రెడ్డి రైతు సంఘం జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు దేవిరెడ్డి మల్లారెడ్డి, కుంచం వెంకన్న,సర్పంచ్ ఎర్ర కన్నయ్య, పుల్లెంల శ్రీకర్, చిట్టి శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశం, రాంబాబు, రవీందర్ రెడ్డి, సలింద్ర తదితరులు పాల్గొన్నారు.