Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీిఆర్ (కార్డియో పల్మనరీ రిసోసి యేషన్) చేసినట్లయితే ప్రాణాలను కాపాడవచ్చునని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో లైఫ్ సేవింగ్ టెక్నిక్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా తరువాతనే ఈ కార్డియాక్లు ఎక్కువ అయ్యాయని తెలిపారు. ఆహారపు అలవాట్లు మారి నేటి సమాజంలో ఎక్కువగా షుగర్, బీపీలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. ఈ సీపీఆర్ శిక్షణకు డాక్టర్లు, అధికారులు, పోలీసులకే, కాకుండా ఆర్ఎంపీ డాక్టర్లకు, యువజన సంఘాల సభ్యులకు కూడా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ టీ.వినరు కష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక వ్యక్తికి ఆకస్మిక గుండెపోటు సంభవించినప్పుడు ప్రాథమిక చికిత్స లేదా అంబులెన్స్ వచ్చేలోపు సీపీఆర్ చేస్తూ ఆక్సిజన్ అందిస్తే ఒక ప్రాణాన్ని, అదేవిధంగా ఒక కుటుంబాన్ని కాపాడిన వారమవుతామన్నారు. అందుకే ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవడానికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇక్కడ వైద్యారోగ్య శాఖ, డీఆర్డీఓ, మెప్మా, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, పోలీస్, రవాణా, విద్యా శాఖలకు చెందిన కొంతమందికి శిక్షణను ఇచ్చి, వారి చేత మరికొంత మందికి శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఆర్‌పై డీఐఓ జమిలుద్దీన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి, శాఖల వారీగా బృందాలకు సిపిఆర్ చేసే విధానాన్ని డెమో ద్వారా చేసి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భుగుప్తా, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్‌రెడ్డి, జిల్లా వైద్య అధికారి డాక్టర్ కొండల్రావు, జిల్లా ఉప వైద్య అధికారి డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.