Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కూలీల జిల్లా కన్వీనర్ సరోజ
నవతెలంగాణ-నల్లగొండరూరల్
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ మండలం జీ చెన్నారంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. గత సంవత్సరంలో చేసిన కూలీల బిల్లులు నేటికి రాలేదని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాలలో మంచినీరు, మెడికల్ కిట్లు , పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండ తీవ్రత చాలా ఉన్నందున వడదెబ్బలు తగిలి మరణాలు జరిగే ప్రమాదం ఉందని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధోని పాములలో చెరువులో పడి మరణించిన ఇద్దరు మహిళలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కట్ట అంజయ్య, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పునూతల పూలమ్మ, ఎంకమ్మ, వెంకటయ్య, మల్లయ్య త్రిపురంబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.