Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లుట్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జూలకంటి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. బడ్జెట్లో అధిక నిధులు కేటాయించకుండా గ్రామీణ పేద ప్రజల పొట్టగొడుతుందని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ లో నిధులు కోత పెట్టడం దుర్మార్గం అన్నారు. చేసిన పనులకు త్వరగా నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేయడం వలన గ్రామీణ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేసి ఎప్పటికప్పుడు చేసిన పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కుట్ర పన్నుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించి గ్రామీణ పేద కూళిలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఉపాధి హామీ కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జా చినవెంకులు, జిల్లా సహాయ కార్యదర్శి లూర్థయ్య,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు పాదూరు శశిధర్ రెడ్డి, వ్యకాస జిల్లా నాయకులు కందూకూరు రమేష్ బాబు, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.