Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితుల ఆందోళన
- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను వదలరు.ఎక్కడ ఖాళీ స్థలం కనిపించిన వెంటనే ఆక్రమణ చేసి కబ్జాకు పాల్పడుతున్నారు.కానీ మండలంలోని తూప్రాన్ పేట గ్రామంలో ఏకంగా వెంచర్ లోని రోడ్డును ఆక్రమించడమే కాకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.వెంచర్ లో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారు లోనికి వెళ్లకుండా అడ్డుగా నిర్మాణాలు చేస్తుండడంతో బాధితులు ఆందోళన చేపట్టారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట గ్రామంలో గ్రీన్ సిటీ వెంచర్ ను 1991-92 కాలంలో చేశారు .వెంచర్ చేసే సమయంలో జాతీయ రహదారి నుండి రోడ్డు కోసం స్థలం వదిలారు. ఈ స్థలంపై కబ్జా కోరుల కన్ను పడింది. అంతే డాక్యుమెంట్ సృష్టించి కబ్జా చేశారు.పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారు.గ్రామస్తులు అభ్యంతరం తెలిపిన పట్టించుకోకుండా నిర్మాణం చేస్తున్నారు.
బాధితుల ఆందోళన...
పైస పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తే వెంచర్ రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేయడంపై బాధి తులు శుక్రవారం ఆందోళన చేశారు. అక్రమంగా నిర్మాణం చేస్తున్న పంచాయతీ పాలక వర్గం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితుల ఆందోళన తెలుసుకొని అక్కడకు వచ్చిన గ్రామపంచాయతీ కార్యదర్శిని నిలదీశారు.వెంచర్ రోడ్డు ఆక్రమిస్తున్నరని చెప్పిన కూడా గ్రామ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.వెంచర్ రోడ్డును ఆక్రమించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా పలితం లేదని విస్మయం వ్యక్తం చేశారు.జాతీయరహదారిపై ఆందోళన చేశారు. చౌటుప్పల్ సిఐ మల్లికార్జున్ రెడ్డి కి ఫిర్యాదు చేసి తమ గోడు వెళ్లబోసు కున్నారు.ఈ కార్యక్రమంలో బాధిత ప్లాట్స్ యజమానులు టి.వెంకట్ రెడ్డి, టి.కవిత, ఈదుల కంటి రామస్వామి, డి.పురుషోత్తం రెడ్డి, నర్సింహ, గ్రామస్తులు లింగస్వామి, రమేష్, జైపాల్ రెడ్డి, మాధవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, యాదగిరి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.