Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అంబేద్కర్ ఆశయాలను సాధించాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వై జంక్షన్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఎంతో ఆశయంతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగం రచించారని, నేటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తూ ధ్వంసం చేయాలని చూస్తుందని ఆరోపించారు. రాజ్యాంగంతోనే ప్రజల స్వేచ్ఛగా బతుకుతున్నారని గుర్తు చేశారు. ఆయన సమాజ సేవ కోసం చివరి శ్వాస వరకు పోరాడారని కొనియాడారు. కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటంతో ప్రదర్శన చేశారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎండీఓ ఆఫీస్ నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు బైక్ ర్యాలీ చేశారు. రైతు బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ట్రాన్స్కో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆర్డిఓ తాసిల్దారు మున్సిపల్ మండల పరిషత్ కార్యాలయాల్లో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.