Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
కృషి పట్టుదలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జూనియర్ సివిల్ జడ్జి , లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, సూరసుమలత అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ రెసిడెన్షియల్ , ఆర్పిఆర్పి స్కూల్ ఆవరణలో విద్యార్థులకు సామాజిక భద్రత పట్ల అవగాహనా సదస్సు నిర్వహించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల గురించి వివరించారు.. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 132 వ జయంతి సందర్భంగ ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావుల రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోట్టిపాముల సాయికృష్ణ, సీస శ్రీనివాస్, సిద్దులు, చింతల సాయి బాబా, హరికృష్ణ, హరిబాబు, రవికుమార్, ఆపాఠశాల ప్రిన్సిపాల్ శీలం సునీత పాల్గొన్నారు.