Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణకు తరలివెళ్లిన దళిత నాయకులు
- ర్యాలీని ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మండలం నుండి శుక్రవారం దళిత మేధావులు, ప్రజాప్రతినిధుల బృందం తరలివెళ్లింది.సూర్యాపేట క్యాంపు కార్యాలయం భాగ్యనగరానికి తరలివెళ్తున్న జనప్రవాహ ర్యాలీని నీలం రంగు జెండా ఊపి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేందర్‌కుమార్, తహసీల్దార్ రంగారావు,ఎంపీపీ ధరావత్ కుమారి, ఎంపీడీఓ లక్ష్మీ,బాబు నాయక్, జెడ్పీటీసీ భూక్యా సంజీవ్‌నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ధరావత్ బాబునాయక్, ఊట్కూరి సైదులు, రావిచెట్టు సత్యం, బొడ్డు విజరుకుమార్, బుర్రి నవీన్, అమ్మయ్య పాల్గొన్నారు.
అర్వపల్లి :హైదారాబాద్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్న 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సభకు మండలకేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుండి బీఆర్ఎస్ నాయకులు బయల్దేరి వెళ్లారు.ప్రతినిధుల బస్సును ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్, జెడ్పీటీసీ దావులవీరప్రసాద్ జెండాఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు గుండగాని సోమేష్‌గౌడ్, రైతు బంధు కో ఆర్డినేటర్ ఎర్ర నర్సయ్య, తహసీల్దార్ యాదగిరి రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు జలంధర్‌రావు, నర్సింహారాజు, కర్నాకర్, ఉపేందర్‌రావు తదతరులు పాల్గొన్నారు.