Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట:అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరిస్తే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడవచ్చని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. శ్రీనివాస్ అన్నారు.ఫైర్ సర్వీస్ వారోత్సవాలలో భాగంగా శనివారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి జోహార్లు అర్పించడం,వారి ఆత్మశాంతికి ప్రార్థించడం,అగ్ని ప్రమాదాలు జరుగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ,ప్రజలను చైతన్యవంతులను చేయడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే సమీప ఫైర్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.ఏదైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే 101కు డయల్ చేయాలన్నారు.అనంతరం జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్, కల్నల్ చౌరస్తాలో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి,కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎల్ఎఫ్కె లింగయ్య,ఎఫ్ఎంజీ శ్రీనివాసరావు,హెచ్జీడీఓపీ ఎస్కె.యాకుబ్, హెచ్జీ సత్యనారాయణ,ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.