Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివ్వెంల : రైతులను రాజును చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్‌రావు, తహసీల్దార్ రంగారావు అన్నారు.మండలంలోని వివిధ గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా వివిధ గ్రామాలలో సెర్ఫ్ ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఆయా గ్రామాల ప్రజాప్రతినిదులు ప్రారంభించారు. పలు కార్యక్రమాలలో మండల వ్యవసాయ అధికారి ఆశాకుమారి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జూలకంటి సుధాకర్‌రెడ్డి,పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ సైదులు, సీఈఓ శ్యాంసుందర్‌రెడ్డి,రౌతునర్సింహారావు, గోవిందరెడ్డి, ఉట్కూరి సైదులు,సర్పంచులు బోడపట్ల సునీత, భూక్యా రాజ్యలక్ష్మినాగునాయక్, దొంగరి కోటేశ్వరరావు, బికారి, కలకొండ కరుణ, ఎంపీటీసీ సుశీల, సాగర్, డైరెక్టర్ శ్రీను,కృష్ణారెడ్డి, మహేందర్,వీరన్న,మహిళా సంఘం సభ్యులు, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.