Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్: ఆలేరు పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీలో నాసిరకంగా సీసీ రోడ్లను నిర్మించడంతో పగుళ్ల మయంగా మారాయి.పురపాలక సంఘాలు, కాలనీలు, వివిధ గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీసీరోడ్ల నిర్మాణ పనులు రూ.వేల కోట్లతో చేపట్టింది.శ్రీ కనకదుర్గ ఆలయం నుండి కొలనుపాక రోడ్డును కలుపుతూ వెళ్లే మెయిన్‌రోడ్డుకు ఈ సీసీరోడ్డు శారదా కిరాణాషాప్ చౌరస్తా నుండి అల్లం సత్తయ్య ఇంట్ణివరకు కలిసి ఉంటుంది.30 ఏండ్ల కింద కొలనుపాక రోడ్డు మెయిన్‌రోడ్డును కలుపుతూ సంతోష్‌నగర్ కాలనీని కలిపే సీసీ రోడ్డు తోట సత్తయ్య ఇంటి నుండి, ఎలుగల బుషరాములు, అమ్మర వెంకటయ్య ఇంటి ముందు మీదుగా కటకం మల్లేశం శారద కిరాణం వరకు గతంలో వేసిన సీసీరోడ్డులో నాణ్యాతాప్రమాణాలు లోపించడంతో కంకర తేలింది.కంకర తేలిన సీసీరోడ్లస్థానంలో నూతన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. నాణ్యతాప్రమాణాలతో సీసీరోడ్డు నిర్మించాలి
ఎలుగల భూష రాములు
30 ఏండ్ల కింద తోట సత్తయ్య ఇంటి వద్ద నుండి కాలనీ చివర వరకు సీసీరోడ్డును నిర్మించారు. కాంట్రాక్టుల కక్కుర్తి కారణంగా సీసీ రోడ్డుపై కంకరతేలింది. కంకరతేలడంతో ఇబ్బందిగా మారింది. సంతోష్నగర్కాలనీ లో పురపాలక సంఘం అధికారులు పాడైన సీసీరోడ్ల స్థానంలో కొత్తసీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలి.