Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
సమాజసేవలో లాభా పేక్ష లేకుండా ట్రస్టులు ముందుండాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు .ఆదివారం స్థానిక కుడకుడలో శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ వి.రామ్మూర్తియాదవ్ అధ్యక్షతన జరిగిన శ్రీ కృష్ణ యాదవ ట్రస్ట్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.తమ వర్గాల అభివృద్ధి కోసం, సమాజంలో వెనుకబడిన వర్గాలను ఆదుకుని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో ట్రస్టులు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.విద్య, వైద్య, సేవా రంగాలలో అవకాశాలు రాని వారిని గుర్తించి ఆయా వర్గాలలోని ఉన్నతులు తమ వంతు సహకారం అందించడం ద్వారా ఎంతో ఉపయోగం జరుగుతుందని వివరించారు.ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు స్వచ్ఛందసంస్థల సహకారం అందించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేని వారికి అండగా నిలవవచ్చన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం బీసీకులాల అభివృద్ధి కోసం సహకరిస్తున్న విషయం తెలిసిందేనన్నారు.అందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తున్న ప్రయత్నాలకు శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు.డీసీఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్ మాట్లాడుతూ తన తోటి వారికి ఆపద సమయంలో అండగా నిలిచిన సందర్భంలో కలిగే ఆనందానికి అవధులు ఉండవన్నారు.అనంతరం శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రేఖ సత్యంయాదవ్,కార్యదర్శి నివేదికను ప్రవేశపెటారు.ఈ కార్యక్రమంలో మర్యాద సైదులుయాదవ్, పోలేబోయిననర్సయ్యయాదవ్, జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, వజ్జె వీరయ్యయాదవ్,గొట్టే రామయ్యయాదవ్, జక్కుల వెంకయ్యయాదవ్,మన్నె రేణుకలక్ష్మీనర్సయ్యయాదవ్, బడుగుల శ్రీనివాస్‌యాదవ్, ఎల్లావుల రాములుయాదవ్, గొడ్డేటి సైదులుయాదవ్, వర్రీ సుధాకర్‌యాదవ్, డాక్టర్ పార్థసారధియాదవ్, దాసరి వెంకన్న యాదవ్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.