Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నారిఐలయ్య
నవతెలంగాణ-కట్టంగూర్
తీవ్ర ఎండలో ఉపాది పనులు రెండు పూటల చేయుస్తున్న విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారిఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హమీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసివేసె కుట్రలో భాగంగా రోజు రెండు పూటల పనిచేయాలని, పనిచేసే చోట రెండు సార్లు హజరు వేసే విధానాన్ని తీసుకొచ్చి కార్మికును తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దుర్మార్గపు ఆలోచనను వెంటనే విరమించు కోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే విధంగా చర్యలు చేపడుతుందని రాజకీయాల అతీతంగా కార్మికులు చట్టం రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పి లుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో యాంత్రికరణ పెరిగిపోవడంతో కూలీలకు సరిపడా పని దొరకలేని పరిస్థితి ఉందని, ఈ చట్టం ద్వారా కొంతమేర పనులు దొరుకుతున్నాయని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఒక పూట పని విధానాన్ని కొనసాగించాలన్నారు. గత సంవత్సరం పని చేసిన కూలీలకు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్షులు ఇటుకాల సురేందర్, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుపల్లి శ్రీను, పోడచెటి రూప, ఎకుల సుజాత, కాడింగి ధనలక్ష్మి, ముక్కాముల సైదులు, అల్లి పార్వతమ్మ, నిమ్మనగోటి సుదర్శన్, అనిత, నర్సింహ్మ యాదయ్య పాల్గోన్నారు.