Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-మద్దిరాల
కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన రిటినేని నరేష్ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు.అగ్ని ప్రమాదంలో నరేష్‌తో పాటు భార్య సుమ చిన్న కుమారుడు సాస్విక్ మృతి చెందిన విషయం తెలిసి వెంటనే స్పందించి తన పర్సనల్ సెక్రెటరీతో తక్షణ సహాయం కింద రూ.లక్ష,నరేష్ తల్లిదండ్రుల ఆరోగ్య ఖర్చుల కింద రూ.25 వేలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన ఫోన్లో నరేష్ తండ్రి జెన్నయ్యతో మాట్లాడుతూ ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరమన్నారు.మేనత్త దగ్గరకు వెళ్ళి ప్రాణాలతో బయట పడి ఉన్న పెద్ద కుమారున్ని తాన దత్తత తీసుకొని బాబు చదువు పూర్తి అయ్యే వరకు అన్ని చూసుకుంటానని హామీ ఇచ్చారు.కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార్త కృష్ణమూర్తి, సర్పంచ్ బరపటి ఉపేందర్,నాయకులు రేటినెని వెంకటయ్య, తీగలి వెంకన్న,దగ్గుల మల్లయ్య,దుగ్యాల కిషన్‌రావు,నల్లాని కిషన్‌రావు నలమాస ఉపేందర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.