Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి
నవతెలంగాణ-చివ్వెంల
దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టలేని ప్రధానిమోడీకి దేశాన్ని పరిపాలించే అర్హత లేదని కెేవీపీఎస్్ జిల్లా ప్రధానకార్యదర్శి కోటగోపి విమర్శించారు.ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ రక్షణ యాత్రలో భాగంగా రెండో రోజు చివ్వెంల మండలకేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు 300 రెట్లు పెరిగాయని విమర్శించారు.ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో దళితులకు దళిత మహిళలకు రక్షణ కరువైందన్నారు.రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మోడీ రాజ్యాంగంలో దళితులకు పొందుపరిచిన హక్కులు, చట్టాలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు.రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం రక్షించుకునేందుకు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటబాట పట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు రాంబాబు నాయకులు గోపి, వీరబాబు, ఉప్పల గోపి తదితరులు పాల్గొన్నారు.
మనువాదాన్ని మట్టుపెట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
ఆత్మకూరుఎస్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తుందని, దళితులందరూ ఐక్యంగా మనువాదాన్ని మట్టుపెట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు.కేవీపీఎస్ రాజ్యాంగ రక్షణ యాత్రలో భాగంగా రెండో రోజు ఆత్మకూరుఎస్ మండలకేంద్రంలో, నెమ్మికల్ గ్రామంలోని దళితవాడలో జరిగిన సభలలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు యాతాకుల వెంకన్న ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి రాంబాబు, ప్రజాసంఘాల నాయకులు ఈదయ్య, సైదులు, మల్లయ్య, సందీపు, నాగయ్య, జలగంభిక్షం, స్టాలిన్, వెంకన్న, కనకమ్మ, గోపి, వీరబాబు, అభి, ఉప్పల గోపి, తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : కేంద్రంలో అధికారంలో ఉన్న మనువాద పాలకులు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి అన్నారు.ఆసంఘం అధ్వర్యంలో సూర్యాపేటలో ప్రారంభమైన రాజ్యంగ రక్షణ యాత్ర జాజిరెడ్డిగూడెం మండలకేంద్రానికి చేరుకుంది.ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చలకూరిరాంబాబు, పిండిగగోపి,ఉప్పలగోపి, కేవీపీఎస్ మండల నాయకులు కొమ్మువిజరు,సిగవెంకన్న,దేవరకొండ బాలయ్య, సర్దార్, దాసరి అనిత తదితరులు పాల్గొన్నారు.
మోతె: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు విమర్శించారు.కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'మనువాదాన్ని మట్టు పెడదాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం' అనే నినాదంతో ఈనెల 16న జిల్లా కేంద్రంలో ప్రారంభమైన జీపు ప్రచారజాతా సోమవారం మండలకేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఎస్సీ కమిటీ హాల్ వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి, సీఐటీయ మండల కన్వీనర్ కాంపాటి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు రాంబాబు, సీఐటీయూ సీనియర్ నాయకులు గుంటగాని ఏసు, వ్యవసాయ కార్మికసంఘం మండల అధ్యక్షులు కిన్నెరపోతయ్య, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి బూడిద లింగయ్య, నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు, డీవైఎఫ్ఐ సీనియర్ నాయకులు కొమ్ము క్రాంతికుమార్, దోసపాటి వెంకన్న, పి.గోపి, శ్రీను, రమేశ్, మల్లయ్య, వెంకన్న పాల్గొన్నారు.