Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాలటౌన్
చిట్యాల మున్సిపల్ కేంద్రంలో ఐకేపీ, వీఓఏల రాష్ట్ర సమ్మె పిలుపులో భాగంగా సోమవారం చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో సమ్మెను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారాబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో గ్రామస్థాయిలలో 17,606 మంది వీఓఏలు, గ్రామ సంఘాలకు సహాయకులుగా పనిచేస్తున్నారు. రూ.3,900 గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ఐకేపీ, వీఓఏలను సైర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రతి కార్మికులకు 10 లక్షల సాధారణ భీమ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. అర్హత కలిగిన వారందరిని సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని, ఇతర డిమాండ్స్‌తో సమ్మె నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు ఏదుళ్ళ లక్ష్మి, ఉపాధ్యక్షురాలు గుడిసె పద్మ, మహంకాళి వనజ కుమారి, ప్రధాన కార్యదర్శి గుడిసె సువర్ణ,సహాయ కార్యదర్శి పాకాల సత్యనారాయణ, దేశపాక సత్తమ్మ, కోశాధికారి వడ్డేగానీ విజయ, కార్యవర్గ సభ్యులు అంతటి వినోద, చింత కింది సుమతి, బురుగు జ్యోతితో తదితరులు పాల్గొన్నారు.
డిండి : వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి వారికి భద్రత కల్పించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కేతావత్ శరత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలని సోమవారం స్థానిక ఏపీవో కార్యాలయం ముందు మండలంలోని వివోఏలు నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భయ్యా వెంకటయ్య, మండల గౌరవ అధ్యక్షులు నారాయణ సింగ్, అధ్యక్షులు గుండ్లపల్లి మల్లేష్, ఉపాధ్యక్షులు దేవసాయం, ప్రధాన కార్యదర్శి పోలం మణెమ్మ, కార్యదర్శులు కూన శ్రీను, పుట్టా పుష్పలత, కోశాధికారి దాసోజు నిర్మల, ఫరీదా, పార్వతమ్మ, బొడ్డు రాణి, కుంభ నిర్మల, కేతావత్ వనిత, బి. లక్ష్మి, కే. రజిని, వై. మౌనిక, వి. శ్రీదేవి, కే. అనిత కే. అమృత, పి. మురళి, వి. సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ : ఐకెపిలో పనిచేస్తున్న విఓఎ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా సహా కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. సోమవారం మర్రిగూడ మండల కేంద్రం సీఐటీయూ ఆధ్వర్యంలో ఐకెపి వీఓఏల నిరవధిక సమ్మెలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలు రంగినేని చంద్రకళ, ప్రధాన కార్యదర్శి గంట మంజుల, కోశాధికారి పానుగంటి పద్మ, కార్యదర్శి లంకలపెళ్లి పాపాచారి, ఉపాధ్యక్షుడు అయితగోని గోపాల్, బుసిరెడ్డ, బరిగెల బుగ్గయ్య, యాస మానస, సభినేని కవిత, భీమనపల్లి భారతమ్మ, ఐతగోని సరిత, భాగ్యలక్ష్మి, పోలే శాంతి, వనపర్తి శోభ, డబ్బు జ్యోతి, కరుణ కొడాలి, కల్పన ఒంపు సుమలత, విజయ, కేతావత్ రజిత, కడారి యాదమ్మ, ఆంగోతు లలిత, తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి : ఇందిరా క్రాంతి పథకములో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామ సంఘం సహాయకులు చాలా కాలంగా అపరిస్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాంపల్లి తహసిల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నుండి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పాల్గొని వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివోఏల మండల అధ్యక్షురాలు ఎస్కే.సైదా బేగం, వీవోఎల మండల నాయకులు వెంకటమ్మ, కలమ్మ, బిక్షపమ్మ, వసుమతి, చంద్రకళ, సుజాత, మమత, అలివేలు, సత్యం, శ్రీలత, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : ఐకెేపీ వీవోఏలను సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దామరచర్ల మండల కేంద్రంలో సోమవారం నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి దయానంద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, వీఓఏల అధ్యక్షులు బజ్జ, కార్యదర్శి అజరు కోశాధికారి సంజీవరెడ్డి, సంఘ సభ్యులు అనిత, అరుణ, ఉమా, పద్మ, రమణ మహేశ్వరి, మధుసూదన్, జంగేశ్వరి, పాల్గొన్నారు.
కేతపల్లి :గ్రామ మహిళా సమాఖ్య వివో ఏ లకు గౌరవ వేతనం నెలకు రూ. 26000 ఇవ్వాలని సిఐటియు మండల కన్వీనర్ ఆదిమల్ల సుధీర్ డిమాండ్ చేశారు. కేతేపల్లిలో సోమవారం వీవో ఏలా సమస్యల పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వివోఏల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తండు సుమీల, సంధ్య, ప్రధాన కార్యదర్శి కాడింగు వీర భద్రయ్య, కమిటీ సభ్యులు వాణి, రాణి, మరియా, రోజా, భాగ్యలక్ష్మి, మోసం శీను, పద్మ పాల్గొన్నారు.
చండూరు : వీవోఏల సమస్యలు పరిశీలించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మండంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు మోగుదాల వెంకటేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సంఘం అధ్యక్షులు పర్సనబోయిన యాదయ్య, కార్యదర్శి మానుక అహల్య, కోశాధికారి పెండ్యాల లలిత, దొంతరగోని శశికళ, కారింగ్ వెంకటమ్మ ,బోయపల్లి అరుణ, సుగుణ, కవిత ,నిర్మల, తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : దీరకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఐకెపి వివోఎ ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివో ఏల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్‌లో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఒంటెపాక వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివోఏ లు లలిత, నిర్మల, శ్రీలత, సంధ్యారాణి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి : వివోఏలకు కనీస వేతనం చెల్లించాలని వివోఏల మండల అధ్యక్షుడు అధ్యక్షుడు మాడం జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. సో మవారం చింతపల్లి మ ండల కేం ద్రంలోని వెలుగు కార్యాలయం ము ందు నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో వివోఏ లు శంకరమ్మ, కవిత, విజయరాణి, చైతన్య, బేబీ, ధనలక్ష్మి, జ్యోతి ,నిర్మల, కవిత తదితరులు పా ల్గొన్నారు.