Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే భాస్కర్‌రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆపదలో ఆదుకునే వాడు ఆపద్బాంధవుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 51 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 33 లక్షల 47 వేల 500 రూపాయల విలువ గల చెక్కులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సహాయనిధి కింద ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎంతోమంది పేద రోగులు మెరుగైన వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మెన్ తిప్పన విజయసింహరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్, ఎంపీపీ నూకల సరళ హనుమంత్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రైతు బందు సమితి సభ్యులు కుందూరు వీరకోటిరెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, వైస్ ఎంపీపీి అమరావతి సైదులు, హతిరం నాయక్, రవితేజ నాయక్, యూసుఫ్, అన్నభిమోజు నాగార్జున చారి, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అన్ని మతాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని షాబునగర్ ఏఆర్సీ గార్డెన్స్ నందు రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల వారి పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రోస్ చైర్మెన్ తిప్పన విజయ సింహరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, రైతుబంధు సంఘం జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మజీద్ కమిటీ అధ్యక్షులు హఫీజుద్దీన్ పాషా, ముస్లిం మత పెద్దలు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.