Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్న రైతాంగం
- శాసన మండలి చైర్మెన్ గుత్తా, ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-చింతపల్లి
చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రైతాంగం నష్టపోతున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించిందని చెప్పారు. అన్నపూర్ణగా వర్ధిల్లాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ళకు సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్ రెడ్డి, ఎంపీపీ భవానిపవన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గోపీడి కష్టా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఉజ్జిని నర్సింహరావు, పీఏసీఎస్ చైర్మెన్ వెంకటయ్య, మహిళ అధ్యక్షరాలు సుమతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.