Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ అన్నారు.నియోజకవర్గంలో ఇఫ్తార్ విందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలో 1500 మంది మైనార్టీలకు బట్టల పంపిణీ చేస్తామన్నారు.ఈ సమావేశంలో ఆర్డీఓ గోపిరామ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ మహమ్మద్ రహత్ అలీ, రైతుబంధు అధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, మహమ్మద్ రైస్, తౌఫిక్ ఖాద్రి ,జావిద్, పొన్నబోయిన సైదులు, మూడవత్ జయప్రకాష్ నారాయణ, జాంగిర్, బషీర్, తదితరులు పాల్గొన్నారు.