Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-హుజూర్నగర్
నేరగాళ్ల గుర్తింపు నేరాల గుర్తింపులో సీసీ కెమెరాలు నేడు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.నేడు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నేరాల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు.కొత్త కొత్త విధానాలతో నేరస్తులు నేరాలకు పాల్పడుతున్నారన్నారు.వారిని గుర్తించే విషయంలో సీసీకెమెరాలు మూడవకంటి మాదిరిగా పనిచేస్తున్నాయన్నారు. వ్యాపారస్తులు తమ వ్యాపార సంస్థల ముందు వాణిజ్య సమస్యల ముందు తప్పక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇది వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మనకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసినా, బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ అడిగినా, ఓటీపీ చెప్పమని అడిగినా చెప్పొద్దన్నారు.అటువంటి ఫోన్లు తిరిగి వస్తుంటే పోలీస్‌స్టేషన్‌లో ్ల ఫిర్యాదు చేయాలన్నారు.డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటుపై అవగాహన కల్పించారు.సీసీ కెమెరాలు నిర్వహణ తమ శాఖ వాళ్లే చూసుకుంటారని తెలిపారు.సీఐ రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.నేరాల అదుపు అదుపుకు ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన విషయాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్‌రెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి నర్సింహారావు,కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి పిచ్చయ్య ,చాంబర్‌ఆఫ్ కామర్స్ అసోసియేషన్ తరపున ఆనంద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.