Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మతసామరస్యానికి ప్రతిగా రంజాన్ అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని జప్తి వీరప్పగూడెం గ్రామంలో బుధవారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉండి అల్లా కప కోసం ప్రార్థన చేస్తారని తెలిపారు శాంతికి సామరస్యానికి ముస్లింలు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మనుషుల మధ్య విద్వేషాలు సష్టించి మతాల పేరిట విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. లౌకిక ప్రజాస్వామ్యంలో అన్ని మతాలవారు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ షేక్ జిందా, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి రవి నాయక్ పేలప్రోలు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.