Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రక్షించుకుందామని జరుగుతున్న రాజ్యాంగ రక్షణ యాత్ర బుధవారం హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు చింతల పాలెంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత దళితులపైన దాడులు తీవ్రతరమయ్యాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలలో రెండు గ్లాసుల విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. దళిత మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నా అరికట్టడం లేదన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఒక్కొక్క పేజీని తీసేసి మనువాదాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్న ఆర్ఎస్ఎస్ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగారపు పాండు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండల కార్యదర్శులు భూక్య పాండు నాయక్ వడ్డేపు సైదులు, సుందర మౌలేశ్వర్రెడ్డి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు బాలునాయక్, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శీలం శ్రీను, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి రాంబాబు, నాయకులు సయ్యద్ రన్ మియా, దున్న ఆభి, ఉప్పల వెంకన్న, పిండిగ గోపి, పోసన బోయిన హుస్సేన్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మీసాలవీరబాబు, తుమ్మకొమ్మ యోనా, అబ్రహం, శరత్, సత్యం, ముత్తయ్య పుల్లయ్య, వెంకన్న, వెంకటేశ్వర్లు, నరసింహారావు, ఏసు పాదం, భద్రమ్మ ,కొండలు, మరియమ్మ ,కుమారి ,ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో మనస్మతికి,రాజ్యాంగానికి మధ్య అంతర్యుద్ధం
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నేరేడుచర్ల :దేశంలో మనస్మతికి,రాజ్యాంగానికి మధ్య అంతర్యుద్ధం నడుస్తుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి,మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి అన్నారు.బుధవారం నేరేడుచర్లలో కెేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుండి 19 వరకు జిల్లావ్యాప్తంగా ఫూలే, అంబేడ్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణ యాత్రను ముగింపు సందర్భంగా వారు మాట్లాడారు.దేశంలో 3 వేల సంవత్సరాల మనస్మతికి, 73 ఏండ్ల భారత రాజ్యాంగానికి మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుందన్నారు. స్వాతంత్య్రఉద్యమంలో ఏమాత్రం సంబంధంలేని, జాతీయ జెండాను వ్యతిరేకించి భారతదేశ రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదని రాదని ప్రకటించిన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే బీజేపీ నేడు కేంద్రంలో అధికారంలో ఉందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ ఇప్పటికే 16 కీలక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిందని, దీంతో ప్రభుత్వం ప్రవేట్ పరం చేయడం ద్వారా దళిత గిరిజన బలహీన వర్గాల రిజర్వేషన్లకు గండి కొడుతుందన్నారు. దళిత గిరిజన జనాభా దామాషా ప్రకారం రావలసిన నిధులు రాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని నీతి అయోగ్ పేరిట నిర్వీర్యం చేస్తుందన్నారు. రాజ్యాంగం రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై నిరంతరం కులవివక్ష పోరాట సమితి శ్రమిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు బచ్చలకూరిరాంబాబు, దున్న అబి,ó పిండిగ గోపి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధూళిపాల ధనుంజయనాయుడు, మాల మహానాడు రాష్ట్ర నాయకురాలు గాజుల పున్నమ్మ, వ్యవసాయకార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీను, నాయకులు కుంకు తిరుపతయ్య, లీలా రామ్మూర్తి, పాతూరి శ్రీనివాసరావు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, ఎడ్ల సైదులు, గుర్రంఏసు, కోదాటి సైదులు తదితరులు పాల్గొన్నారు.
మతోన్మాద బీజేపీని తరిమికొట్టాలి
పాలకవీడు: మతోన్మాద బీజేపీ అరాచకాలకు దేశంలో హద్దే లేకుండా పోయిందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి మండిపడ్డారు.మండలంలోని బొత్తలపాలెం, పాలకీడు గ్రామాల్లో కేవీపీఎస్ జాతాను నిర్వహించిన ఆయన బీజేపీ ఆగడాలను ప్రజలకు వివరించారు.ఈ జాతాలో కళాకారుల బందం ఆటపాటలతో రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరించారు.సీఐటీయూ నాయకులు కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే మనువాదాన్ని అమలు చేస్తారని విమర్శించారు.దళిత యువజన నాయకుడు గోల్కొండ అంజి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఒక దళితులకే కాకుండా, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేదని, ప్రభుత్వాలు దాన్ని అమలు చేయడంలో విఫలం కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గురవయ్య, బచ్చలకూరి రామ్‌చరణ్, పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ మట్టేష్, యేసురత్నం, కొండా పెద్దఎల్లయ్య, ఎంపీటీసీ మీసాల ఉపేందర్ పాల్గొన్నారు.
గరిడేపల్లి : దళితులందరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. కేవీపీఎస్ రాజ్యాంగ రక్షణ యాత్ర మంగళవారం రాత్రి మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా దళితవాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న మనువాద పాలకులు మనస్ఫూర్తిని ప్రవేశ పెట్టాలని చూస్తున్నారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన దళితులు గౌరవంతో బతుకుతున్నారని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారా కుల రహిత సమాజాన్ని సాధించవచ్చని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల కోసం రాజ్యాంగ రక్షణ కోసం దళితులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, సీఐటీయూ జిల్లా నాయకులు షేక్ యాకోబు, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు రవి, ఏఐటీయూసీ నాయకులు సుధాకర్‌రెడ్డి, బచ్చలకురి రాంబాబు, నాయకులు పిండిగ గోప,ి దున్న అభి, ఉప్పల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.