Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు తుప్పుబట్టిన పోస్ట్బాక్స్లు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
అనుబంధాలకు ఆప్యాయతలకు ఒకనాడు ఉత్తరాలు వేదిక అయ్యేవి.పట్టణాలు,,గ్రామాలలో పోస్టాఫీస్, పోస్ట్‌బాక్స్ ఉండేవి.ఉత్తరాల ద్వారా బంధువులు, స్నేహితులు తమ కష్టసుఖాలను ప్రేమానురాగాలను అక్షర రూపంలో తెలియజేసుకునేవారు.30,40 సంవత్సరాల కింద ఆప్యాయతలకు చిరునామాగా ఉత్తరాలు ఉండేవి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఉపాధి కోసం బతుకుదెరువు నిమిత్తం విదేశాలకు వెళ్లే వారు, ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లేవారు, తమ స్నేహితులకు, తల్లిదండ్రులకు, ప్రియమైన వారికి ప్రేమతో ఉత్తరాలు రాసి తమ యోగక్షేమాలు తెలిపేవారు. తెలుసుకునేవారు. ఉన్నత చదువులు అనంతరం, విదేశాలలో, దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డవారు ఉపాధి కోసం వెళ్ళిన వారు అక్షర రూపంలో ఆప్యాయతను పంచుకునేవారు.పోస్ట్‌మేన్ కనపడ్డాడు అంటే తమకు ఉత్తరం వచ్చిందా అని అడుగుతూ, స్నేహితులు బంధువులు పంపే ఉత్తరాల కోసం, ఉత్తరాలు పంచె పోస్ట్‌మేన్ కోసం ఎదురుచూసేవారు. ఆలూరు పోస్టాఫీస్ కేంద్రంగా మండలంలోని వివిధ గ్రామాలు, ఆలేర్ పోస్టల్ సెక్టార్ పరిధిలోని గ్రామాలలో పోస్ట్మ్యాన్లు ఉత్తరాలు పంచుతూ ఇంటింటికి పంచుతూ తిరిగేవారు. ఆనాటి మధుర స్మతుల గురించి ప్రతిఒక్కరూ గుర్తు చేసుకుంటారు.నెలలో వేలాది ఉత్తరాలు ఆలేరు పరిసర ప్రాంతాలకు వచ్చేవి.1995 నుండి 25 సంవత్సరం వరకు పేజర్లు సైతం పోస్ట్ ఉత్తరాల స్థానంలో వచ్చి చేరినవి.వాటి ద్వారా వెనువెంటనే పరిస్థితుల గురించి మెసేజ్‌లు పెట్టుకునేవారు. ఉత్తరాలు,పేజర్ల స్థానంలో మొబైల్ ఫోన్లో స్మార్ట్ఫోన్లు రావడంతో ఉత్తరాల కథ ముగిసింది.ఫోన్లోనే ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభించారు.ఒక వెలుగు వెలిగిన పోస్టుబాక్స్ నేడు మూగపోయింది.నేటి కంప్యూటర్ యుగం లో నెట్టు, ఇంటర్నెట్ రావడంతో గ్రామీణ ప్రాంతాలలో పట్టణాలలో ఎక్కడ చూసినా పోస్ట్ ఆఫ్ బాక్సులు తుప్పు పట్టి పోయాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా ట్విట్టర్, వాట్సాప్, ఇతర యాప్‌లు వచ్చి చేరాయి.ఇప్పటికీ పాత తరం వారు పోస్టు, ఉత్తరాల గురించి అప్పుడప్పుడు గుర్తుచేసుకొని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.