Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యలు, పాలు కేసులు ప్రత్యేక కోర్టు ద్వారా పరిష్కరించబడతాయని పీజీఆర్ఎస్ చైర్మెన్ దిలీప్‌కుమార్ అన్నారు.మండలకేంద్రంలో బుధవారం తెలంగాణ సాధారణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆపరేషన్ సర్కిల్, యాదాద్రి భువనగిరి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట ,మోటకొండూరు మండలాలకి చెందిన, విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యలపై నియోజకవర్గ కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో ఉదయం 11 గంటల నుండి, మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రత్యేక కోర్టు ని జిల్లా , స్థానిక ఆలేరు డివిజన్ విద్యుత్ అధికారులు, నిర్వహించారు. 53 వివిధ సంబంధిత కేసులపై దరఖాస్తులు స్వీకరించారు. మెంబర్ ఆఫ్ టెక్నికల్, సీజీఎం పి.నాగేశ్వరరావు, భువనగిరి డీఈ డీఎస్.మల్లికార్జున్, ఆలేరు సబ్ డివిజన్ ఏడీి, జి.సూర్యనాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న వినియోగదారుల కేసులకు పరిష్కారం చూపబడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు ఏఈ శ్రీనివాస్, మోటకొండూరు, యాదగిరిగుట్ట, రాజపేట, విద్యుత్ అధికారులు వినియోగదారులు పాల్గొన్నారు.