Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుభవం లేకున్నా డ్రైవర్లను టీం డ్యూటీ చేయాలంటున్న వైనం
- బస్సు రన్నింగ్ సమస్యలతో భయపడుతున్న అనుభవం లేని డ్రైవర్లు
- ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
- సమస్యపై మంత్రిని కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట ఆర్టీసీ డిపోలో అధికారిని అజమాయిషి డ్రైవర్ల పాలిట శాపంగా మారింది వివరాల్లోకెళ్తే సూర్యపేట ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న నాగశ్రీ తాను చెప్పిందే విధంగా నడుచుకోవాలంటూ ఆర్టీసీ డ్రైవర్ల పై ఒత్తిడి తీసుకువస్తుందని పలువురు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ డిపోలో సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులకు కండక్టర్ డ్రైవరు ను ఇదివరకు కేటాయించేది అయితే పొదుపులో భాగంగా ప్రస్తుతం టికెట్లు చేతి నుండి కాకుండా టీం మిషన్ ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సంగతి తెలిసింది. దాంట్లో భాగంగా హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు కేవలం డ్రైవర్ మాత్రమే పంపి టీం మిషన్ ద్వారా టికెట్లను కూడా ఆర్టీసీ డ్రైవర్ పంపిణీ చేస్తున్నారు. అనుభవం ఉన్న డ్రైవర్లు బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ టీం మిషన్ ద్వారా ప్రయాణికులకు టికెట్లు అందించగలుగుతారు అయితే డ్రైవర్లుగా ఉన్న కొంత మంది తక్కువ చదువుకోవడం వల్ల టిమిషను ఆపరేట్ చేయలేక సతమతమవుతూ టికెట్ల పంపిణీ సరిగా చేయలేకపోతున్నారు .దీనివల్ల కొందరు ప్రయాణికులు ఇదే అదనుగా టికెట్ పైసలు మిగిలిందనుకొని గుంబనంగా కూర్చుని ఉంటారు ప్రయాణ మధ్యలో ఆర్టీసీ అధికారులు చెకింగ్ వస్తే ఆ తప్పిదం డ్రైవర్ సీట్ లో ఉన్న డ్రైవర్ పై పడక తప్పదు. దీనివల్ల సదరు డ్రైవరు ఉద్యోగం పోవాల్సి వస్తుంది. అతని కుటుంబం వీధిన పడక తప్పదు అనుభవం ఉన్న డ్రైవర్ల కైతే ఏ సమస్య ఉత్పన్నం కాదు కానీ అనుభవం లేని డ్రైవర్ల కు ఈ సమస్య పెద్ద సవాల్‌గా మారింది .అయితే కొందరు డ్రైవర్లు డిపో అసిస్టెంట్ మేనేజర్ కు తమ బాధను చెప్పుకుంటూ తమకు టిమ్ మిషన్ సరిగా ఆపరేట్ చేయరాదని తమకు డ్రైవరు టింమిషన్ డ్యూటీ వేయకూడదని ఎంతగా ప్రాధేయపడిన ఇవేమీ లెక్క చేయకుండా అలాగే డ్యూటీలు వేస్తూ వస్తున్నారు .అయితే కొంతమంది కార్మికులు మానసికంగా బాధ పడుతూ తాము ఈ డ్యూటీ చేయలేమంటూ సెలవులు పెట్టుకుంటున్నారు.
ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది..
సరిగ్గా 8 సంవత్సరాల క్రితం సూర్యాపేట ఆర్టీసీ డిపోలో సిఐ గా పని చేసిన ఒక అధికారి తీరు వల్ల డ్రైవర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా డ్యూటీలు చేసి అలసిపోయిన ఆ కార్మికుడు డిపోలో విశ్రాంతి తీసుకుని ఉండగా సదరు సీఐ మరోసారి మిర్యాలగూడ రూట్లో డ్యూటీ వేశారు. తాను ఇప్పటికే డబల్ డ్యూటీ చేసి అలసిపోయారని మరో మారు డ్యూటీ కి వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పగా ఇదేమి పట్టని అధికారి డ్యూటీకి వెళ్లాల్సిందని హుకుం జారీ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అ కార్మికుడు భీమారం మిర్యాలగూడ రూట్లో బస్సును నడుపుతుండగా సరిగ్గా భీమారం వంతెన వచ్చేసరికి ఛాతిలో నలతగా ఉండి బస్సును ఒక పక్కకు ఆపి స్టీరింగ్ మీద వాలిపోయాడు. బస్సులోని ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ డ్రైవర్ గుండె పోటుతో చనిపోయాడని నిర్ధారించారు .అప్పట్లో ఆ అధికారి నిర్ణయం వివాదాస్పదంగా మారి డ్రైవర్ కుటుంబం వీధిన పడింది. ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న నాగశ్రీ వ్యవహార శైలి కూడా ఇంచుమించు అలాగే ఉంది. టిం మిషన్ ఆపరేటర్ చేయరాని కార్మికులు డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులు టికెట్లు ఇచ్చే క్రమంలో ఎదురుగా వచ్చే ఏ వాహనైనా ఢకొీడితే దాన్ని బాధ్యత ఎవరిదని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
సెలవు పెడితే సాక్ష్యం కావాల్సిందే..
అయితే ఆ అధికారినిలో మరో కోణం కూడా దాగి ఉంది కార్మికులు ఎవరైనా అనారోగ్య కారణాలతో కానీ సమీప బంధువులు కానీ చనిపోతే ఆమెకు సాక్షాదారులతో సహా చూపించాలి. ఉదాహరణకు కార్మికుడు జ్వరం వచ్చి రాలేని పరిస్థితిలో సెలవు పెడితే డాక్టర్ దగ్గరకు వెళ్లిన ప్రిస్క్రిప్షన్ ఆమెకు సమర్పించాలి. ఒకవేళ కార్మికుడి సమీప బంధువు చనిపోతే చనిపోయిన వారి ఫోటోని అక్కడ నుండే వాట్సాప్ కు పంపాలి. కార్మికులు సెలవు పెట్టుకునే స్వేచ్ఛ లేకుండా ఆ అధికారిని వ్యవహరిస్తుందని కార్మికులు వాపోతున్నారు.మంత్రిని కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు.ఈ సమస్య గురించి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి ని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు బుధవారం రాత్రి ఆయనను కలిశారు. ఆర్టీసీలో కార్మికుల పై అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని మంత్రి దష్టికి తీసుకువెళ్లారు త్వరలో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని కార్మిక నాయకులతో మంత్రి అన్నట్లు వారు తెలిపారు.
అనుభవం మెరకే రిక్రూట్మెంట్ చేశాం
ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ
జిల్లాలో కొంతమంది డ్రైవర్లు రిటైర్మెంట్ కావడంతో స్ట్రీమ్ డ్రైవర్ల కొరత ఏర్పడింది. అందులో భాగంగానే స్ట్రీమ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకున్నాము. వారిలో కూడా అనుభవం ఉండి,చదువుకున్న వాళ్లకే ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నాం.