Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్యలు కొలెత్తకుండా చూడాలని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మండలం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. భగీరథ ద్వార గ్రామాల్లో సురక్షిత త్రాగునీటి అందించడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. వేసవికాలంలో ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని చోట త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేయాలి ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, వైస్ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, ఎంపీడీవో విజయ శ్రీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ఆయా శాఖల మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ తోఫాలు పంపిణీ
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు తోఫాలు పంపిణీ చేస్తుందని బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఏఆర్ఏఆర్ ఫంక్షన్ హాల్ లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకుడు గఫూర్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదర,సోదరీమణులకు రంజాన్ తోఫాలను (కిట్ ను) ఎమ్మెల్యే పంపిణీ చేసిిి మాట్లాడారు. నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ పైడిమర్రి సత్యబాబు, బీఆర్ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, గంట సత్యనారాయణ, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నయీమ్, కో-ఆప్సన్ సభ్యులు డాక్టర్ బ్రహ్మం, సాదిక్ ఖాన్, అఫ్జల్, మజార్, ముస్లిం మత పెద్దలు మౌలానా, యూసుఫ్ ,బిఆర్ఎస్ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.