Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతర కరపత్రం విడుదల
- జయప్రదానికై పిలుపునిచ్చిన కేవీపీఎస్, ప్రజా సంఘలు
నవతెలంగాణ-నల్లగొండరూరల్
ఏప్రిల్ మాసంలో భారతదేశ సామాజిక విప్లవకారులైన పూలే, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సమాజంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఈనెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్బీఆర్ గార్డెన్లో పూలే, అంబేద్కర్ జాతరను నిర్వహించడం జరుగుతుందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. గురువారం నల్లగొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో గల పూలే విగ్రహం దగ్గర పూలే అంబేద్కర్ జాతరకు సంబంధించిన కరపత్రాన్ని కేవీపీఎస్, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున, మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారత రాజ్యాంగాన్ని అంచలంచెలుగా విధ్వంసం చేస్తుందని, పూలే, అంబేడ్కర్ ఆలోచనలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పాలకులు ప్రజాస్వామ్యం పేరుతో అంతర్గతమైన నియంతత్వ విధానాలను అమలు చేస్తున్నారని, ప్రశ్నిస్తున్న గొంతుకులను భౌతికంగా నిర్మూలిస్తున్నారని చెప్పారు. శాస్త్రీయమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ విద్యా వ్యాప్తికై కుల వివక్షతలు లేని వర్గ వివక్షతలు లేని సమసమాజ స్థాపనకై పూలే, అంబేడ్కర్, నారాయణ, గురు, పెరియర్ రామస్వామి నాయకర్ లాంటి ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి ఈనెల 28న నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సామాజిక దళిత బహుజన కళారూపాలతో నిర్వహించే పూలే అంబేద్కర్ జాతరకు మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు బుద్ధి జీవులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న, రజక సంఘం జిల్లా కార్యదర్శి చెరుకు పెద్దులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోహన్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్, మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, దళిత బహుజన కూలి రైతు సంఘం బాధ్యులు కే.పర్వతాలు, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్, చుక్కా సైదులు,మాల మహానాడు నాయకులు రేఖల సైదులు, కత్తుల జగన్ కత్తుల షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.