Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల
నవతెలంగాణ-నకిరేకల్
ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. గురువారం మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి వసతులు లేవన్నారు. మండుతున్న ఎండలకు రైతులు తాళలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద చలువ పందిర్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హామీ ప్రకారం కొనుగోలు కేంద్రాల వద్ద రూ.5కే మధ్యాహ్న భోజన కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. హమాలి చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు పాటి వెంకట రంగారెడ్డి, మండల కార్యదర్శి మర్రి వెంకటయ్య, స్వరూప, వెంకట్ గౌడ్, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.