Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ఈనెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే ఫూలే అంబేద్కర్ జన జాతర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్, వృత్తి దారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీ ధర్ కోరారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం సామాజిక సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జన జాతర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం పరిరక్షణ, రిజర్వేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం జరిపే ఈ కార్యక్రమానికి అన్ని సామాజిక, వృత్తి దారుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నల్లగొండ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా మేధావుల ప్రసంగాలతో పాటు కళాకారులచే ఆట,పాట, మాట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దైద రవీందర్ మాట్లాడుతూ మహిళలను, అణగారిన వర్గాలను విద్యావంతులు చేయటంలో కుల వివక్షత, అంటరాని తనం నిర్మూలనకు జీవితం అంతా శ్రమించిన మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిల సందర్భంగా ఏర్పాటు చేసిన జన జాతర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల, వృత్తి దారుల, సామాజిక సంఘాల నాయకులు చిలుకూరు లక్ష్మి నర్సయ్య, సకినాల రవి, అరూరి వెంకటేశ్వర్లు, నకిరేకంటి అంజయ్య, గాదగోని కొండయ్య, రాచకొండ వెంకన్న, వంటెపాక వెంకటేశ్వర్లు, అంబేద్కర్, చెన్నబోయిన నాగమణి, పి.శశికళ, వంటెపాక క్రిష్ణ, చిలుముల రామస్వామి, ఏర్పుల తాజేశ్వర్, సాకుంట్ల నర్సింహ, నకిరేకంటి అంజయ్య, పుట్ట సత్తయ్య, మిర్యాల చంద్రశేఖర్, గండమల్ల బాలస్వామి వంగూరి వెంకన్న పాల్గొన్నారు.