Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నిడమనూరు
ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మే ఒకటో తేదీ నుండి మే డే వారోత్సవాలను వాడ వాడనా ఘనంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం నిడమనూరులో మేడే సన్నాక సమావేశం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో సీఐటీయూ జిల్లా నాయకులు కోదండ చరన్ రాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కుల మతాల కతీతంగా నిర్వహించుకునే ఏకైక పండుగ మే డే ను కార్మికులందరూ ఐక్యంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. గతం కంటే నేడు జరగబోయే మే డే ఉత్సవాలు ఒక ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నాయని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో మేడే విశిష్టతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుందని, విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తుందని ఇటువంటి దుర్మార్గమైన చర్యలను కార్మిక వర్గం ముక్త కంఠంతో ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, కందుకూరి కోటేష్ ఆకారపు నరేష్, వింజమూరు శివ, ముత్యాల కేశవులు, బొడ్డు లింగయ్య, తోటపల్లి బాల నారాయణ చంద్రయ్య శ్రీనివాస్ రెడ్డి భాష పాక సైదులు వెంకటమ్మ,మైసయ్య రాములు వింజమూరు పుల్లయ్య, ఎల్లమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.