Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ-నల్లగొండ
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. మహిళలపై వివిధ రూపాలలో దాడులు జరుగుతూనే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని గతంలో చెప్పడం జరిగిందని కానీ నేటికీ అమలు కాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, విద్యుత్, రైతు చట్టాలను నిర్విర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై పెరుగుతున్న హత్యలు, హత్యాచారాలు, గృహ హింస కేసులు పెండింగ్లో ఉంటున్నాయని వెంటనే కేసులను పరిష్కారం చేసి బాధితులకు న్యాయం జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, జయమ్మ, సుష్మ, విజయలక్ష్మి, వసంత, సుమజ్ఞ తదితరులు పాల్గొన్నారు.