Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో అల్ట్రా స్కానింగ్ సెంటర్ మంజూరు చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శుక్రవారం వైద్యశాఖ మంత్రి హరీష్‌రావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీటీజీ మిషన్లు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని దిండి ఆస్పత్రిని 10 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా మార్చాలని, చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి గ్రామంలో పల్లె దవాఖాన మంజూరు చేయాలని, దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని మంత్రిని కోరారు.