Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంను శుక్రవారం అదనపు కలెక్టర్ భాస్కర్రావు తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు రికార్డ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు ధాన్యం ఆరబోసి తాలు, రాళ్ళు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, వ్యవసాయ అధికారులు, రైతులకు అవగాహన కలిగించాలని కోరారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని రామ లక్ష్మన్ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన లారీల నుండి అన్ లోడింగ్, స్టోరేజి విధానం పరిశీలించారు. ధాన్యం అన్ లోడింగ్ మిల్లు వద్ద వెంటనే చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.