Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చౌటుప్పల్రూరల్
మండలంలోని ఎల్లంబావి గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన చేనేత కార్మిక శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీ కేంద్రాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్ ని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీ కేంద్రాలపై గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. చేనేత కార్మికుల శిక్షణ కేంద్రాన్ని బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిడి ఉపేందర్ రెడ్డి, ఎంపీడీవో సందీప్ కుమార్, ఆర్ఐ సుధాకర్ రావు, గ్రామ సర్పంచ్ గుర్రం కొండయ్య, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.