Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కూలీల శ్రమకు దక్కని ఫలితం
- పనిచేసే చోట సౌకర్యాలు కరువు
- రోజురోజుకు తగ్గుతున్న కూలీల సంఖ్య
నవతెలంగాణ- ఆలేరురూరల్
ఉపాధి హామీ కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. మండుటెండలో కష్ట పడుతున్న కూలీలకు రోజు కూలి సగం కూడా పడడం లేదు. కూలీలు కంపచెట్లు తొలగిస్తే ఒక్కొక్కరికి 250 గిట్టుబాటు ధర అవుతుంది కానీ 150 రూపాయల లోపే బిల్లు వస్తుంది. గతంలో వేసవికాలం వచ్చిందంటే వేసవి ఆవలెన్సు ఉండేటివి కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని కూడా నిలిపివేసింది. పనిచేసే చోట సౌకర్యాలు కల్పించడం లేదు. ఎండ అధికంగా ఉండడంతో కూలీలు పనికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆలేరు మండలంలోని 6601 మందికి జాబ్ కార్డులు ఉండగా గతంలో 13234 మంది కూలీలు పని చేసేవారు కానీ 4 610 మంది కూలీలు హాజరవుతున్నారు.
రూ.120 నుండి 150 పడుతుంది
ఉపాధి పనిలో కొలతల ప్రకారం కూలీలకు రేట్లు కేటాయిస్తున్నారు. మండుటెండలో కష్టపడుతున్న కూలీలకు గిట్టుబాటు ధర రావడం లేదు. రోజు 120 రూపాయల నుండి 150 రూపాయలు దాటడం లేదని వాపోతున్నారు. గతంలో వేసవి అలవెన్స్ లో భాగంగా రోజు వేతనానికి అదనంగా ఫిబ్రవరి నెలలో 20 రూపాయలు మార్చి ఏప్రిల్ మే నెల లో 30 రూపాయలు జూన్ నెలలో 20 రూపాయలు కలిపి చెల్లించేవారు గడ్డపారలకు ,పారలకు మొనలు పెట్టించుకోవడానికి ప్రభుత్వమే డబ్బులు చెల్లించేది. ప్రస్తుతం ఇలాంటి అలవెన్స్ తొలగించారు. దీంతో కూలీలు ఎండలకు పని చేయాలంటే జంకు తున్నారు.
ఇప్పుడు జరుగుతున్న పనులు
ఉపాధి హామీ పనిలో భాగంగా మట్టి రోడ్డు పోయడం నీటి గుంటలు తీయడం నర్సరీల పెంపకం రైతుల పొలాల్లో మట్టి పోయడం కంప చెట్లను తొలగించడం లాంటి పనులు కూలీలు చేస్తున్నారు. వాటిలో మట్టి గుంటలు తీయడానికి ఒక రేటు కంపచెట్లు తొలగించడానికి ఒక రేటు ఇస్తున్నారు.
వసతులు కరువు
ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతాల్లో కూలీలు సేద తీరడానికి టెంట్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి సౌకర్యం కల్పించాలి మెడికల్ కిట్లు ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలి. కానీ ఇలాంటివి ఎక్కడ కనిపించడం లేదు కూలీలు త్రాగడానికి నీళ్ల బాటిల్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీళ్లు ఎక్కువగా తాగడంతో బాటిల్లో నీళ్లు అయిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు సేద తీరడానికి టెంటు లేకపోవడం వల్ల పక్కన ఉన్నటువంటి కంపచెట్ల నీడలో కూర్చుంటున్నారు.
కూలీ పడడంలేదు
ఉపాధి కూలి పుల్లూరు నర్సమ్మ
ఉపాధి పనులకు వెళితే 150 రూపాయల పడితే గిట్టుబాటు కావడం లేదు గతంలో గడ్డపార పార మొన్న పెట్టించుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది ఇప్పుడు ఆ ఆలవెన్స్ తీసేశారు. గతంలో పని చేస్తుంటే ఒక మనిషిని సపరేట్గా పెట్టి నీళ్లు అందించే సౌకర్యం ఉండేది ఇప్పుడు ఎవరి బాటిల్లో వాళ్ళు తేవడం చాలా కష్టంగా ఉంది అందులో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వెంటనే అయిపోతున్నాయి వేరే బావుల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది.
పని రోజులు పెంచాలి
జూకంటి పౌల్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి
ఉపాధి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రోజు 120 నుండి 150 రూపాయలు మధ్యలో కూలి వస్తుంది. 50 రోజులకు మించి కూలి దొరకడం లేదు. పని దినాలు పెంచాలి. పనిచేసే చోట వసతులు లేవు కల్పించాలి.