Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి
రంజాన్ పండుగ పురస్కరించుకొని పట్టణంలో ని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి , డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వేరు వేరు గా హజరై ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతసామరస్యం పాటించే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అన్నారు. సోదరభావం తో కలిసి మెలిసి ఉండాలన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ద్వీ చక్ర వాహనం పై ముస్లిం సోదరుల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్, కాంగ్రెస్ నాయకులు తంగళ్ళపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్ పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : భారత దేశం లౌకిక దేశమని, ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తూ ప్రజలు కలిసి మెలిసి జీవించాలని ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎం డి అజార్ ఇంటికి ఇఫ్తార్ విందు కు వచ్చిన ఆయన గ్రామంలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తెల్జీరి వెంకటేష్ యాదవ్,షానూర్, మనోజ్, శ్రీకాంత్, వెంకటేష్ లు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ముస్లిమ్‌లు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణకేంద్రంలోని ఈద్గాలు, మజీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలరు బలరు తీసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ముస్లిమ్‌లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిమ్‌ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కషిచేస్తున్నారని తెలిపారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు
ఆలేరుటౌన్ : రంజాన్ పండగ పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు శాసనసభ్యురాలు, గొంగిడి సునీత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, సీపీిఐ జిల్లా కార్యదర్శి గోదా. శ్రీరాములు, ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కుడుదుల. నగేష్, బూడిద బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు జనగాం ఉపేందర్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఆలేరు అసెంబ్లీ కాంటెస్ట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, ఆలేరు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య , వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్, పిఎసిఎస్ చైర్మన్ మొగలగాని మల్లేశం, వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురహరి , సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, ధూపటి వెంకటేష్ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
భూదాన్‌పోచంపల్లి : మండల వ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినం ఈద్-ఉల్-ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఈదుర్గ వద్ద ముస్లింలు సమూహక నమాజ్ చేశారు. అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మదీనా మసీదు కమిటీ అధ్యక్షుడు సయాద్, ఇబ్రహీం అలీ, ఉపాధ్యక్షులు మహమ్మద్ అలీ, షరీఫ్, ఎండి రసూల్ ,మియా, సెక్రెటరీ కుమార్ ,కోశాధికారి ఎండి.ఆరిపుల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ హబ్జి, తదితరులు పాల్గొన్నారు.