Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వమత సంప్రదాయాలకు,ఆచారాలకు పెద్దపీట
- రంజాన్‌ను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దోహదపడ్డాయని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఈద్గాలో రంజాన్ పండుగ సందర్బంగా ముస్లిం సోదరులు, మత పెద్దలతో కలసి పండుగ నమాజ్ లో రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్యాయదవ్ లతో కలసి పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మత పెద్ద అత్తార్ మౌలానా ను కలిసి ఈద్ ముబారక్ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో నెల రోజులుగా కఠోరమైన దీక్ష చేపట్టి రంజాన్ పర్వదినం రోజున విడిచి భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సమాజానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. యావత్ సమాజం సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పాడి పంటలు సమద్ధిగా పండాలని కోరుకుంటూ శాంతిసామరస్యాలు ఫరీడ విల్లాలన్న సంకల్పంతో నెల రోజులుగా కఠోర దీక్షలు చేసిన వారి ప్రార్ధనలకు అల్లాయే మోక్షం కలిగిస్తారన్న విశ్వాసం ఉందన్నారు. సర్వమత ఆచార వ్యవహారాలను గౌరవించడంలో తెలంగాణా ప్రత్యేకతను చాటుకుందన్నారు.బతుకమ్మ,రంజాన్,క్రిస్మస్ పండుగలను అధికారికంగా నిర్వహించేది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఇది చక్కటి నిదర్శనమన్నారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మైనార్టీల సమాజాభివద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహమ్మద్ ప్రవక్తత బోధించిన మార్గాన్ని సుగమం చేస్తూ ప్రపంచ మానవాళి సంతోషంగా ఉండేలా కఠిన, ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ఆచారాలు, సంప్రదాయాలు గౌరవించే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం తరపున పండుగను పురస్కరించుకుని రంజాన్ తోఫాలు, ఇఫ్తార్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు.ఇఫ్తార్ కార్యక్రమాలు ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. నమాజ్ అనంతరం జరిగిన ప్రత్యేక 'దువా'లొ మంత్రి పాల్గొన్నారు.తర్వాత ముస్లిం సోదరులు మంత్రిని ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నవతెలంగాణ రిపోర్టర్ జహంగీర్ మంత్రిని కలిసి ఈద్ ముబారక్ చెప్పారు.అనంతరం మంత్రి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఈద్ ముబారక్ చెప్పారు. అనంతరం పట్టణంలోని పలు ముస్లిం కుటుంబాల నివాసాలకు వెళ్లి ఆయన సేమియాలు సేవించారు.కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు.చిన్నారులు మంత్రితో సెల్ఫీలు దిగారు.ఈ కార్యక్రమంలో జెడ్పీవైస్చైర్మెన్ వెంకట నారాయణగౌడ్, జెడ్పీటీసీ జీడిభిక్షం, మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్ట కిశోర్,బీఆర్ఎస్ నేత వై.వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు భాషా, తాహేర్‌పాషా,చాంద్బారు, జహీర్, సయ్యద్ సలీమ్,రఫీ,అజీజ్,తాహేర్ తదితరులు పాల్గొన్నారు.