Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
మండల కేంద్రంలోని రామన్నగూడెంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని అదనపు కలెక్టర్ మోహన్రావు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన ధాన్యం కొనుగోలు వద్ద ప్రారంభించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులురాకుండా చూడాలన్నారు.రైతులకు ప్రభుత్వం సూచించిన గిట్టుబాటు ధర రావాలంటే నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలన్నారు.డీఎం రాంపతి మాట్లాడుతూ శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్దగా నష్టం వాటిల్లలేదన్నారు. మండలంలో చిన్నపాటి వర్షమే పడిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్నీబ్యాగుల కొరత లేదన్నారు.ఇప్పటివరకు జిల్లాలో 272 ధాన్యం కొనుగోలుకేంద్రాలను ప్రారంభించామన్నారు.6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.లారీల సమస్య కూడా లేకుండా చేశామన్నారు.కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే తెలియజేయాలన్నారు.ఆయన వెంట పీఏసీఎస్ ఈఓ రామస్వామి, సిబ్బంది మహేందర్, సైదులు ఉన్నారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన తహసీల్దార్
నాగారం : మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని శనివారం తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాలని సూచించారు.రైతులు ఆందోళన చెందొద్దని, ప్రతిగింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పేరాల యాదగిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.