Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్ఎస్
రబీ సీజన్ వరిపంటపై వరుణుడు కన్నెర్ర చేశాడు.చేతికొచ్చిన వరిపైరు, దాన్యం ఆకాల వర్షానికి తీవ్ర నష్టం కలిగించింది.శుక్రవారం రాత్రి కురిసిన వర్షం గాలి దుమారంతో వంట పొలాలు పాడయ్యాయి.కోతలు ప్రారంభమై 20 రోజులైనప్పటికీ ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారు.కొనుగోలుకేంద్రాలను ప్రారంభించినప్పటికీ అధికారులు కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేశారు.దీంతో అకాలవర్షానికి వరిధాన్యం తడిసింది.మండలంలో 14 ఐకేపీకేంద్రాలు,నాలుగు పీఏసీఎస్కేంద్రాలు, నాబార్డు ఆధ్వర్యంలో రెండు కేంద్రాలను ప్రారంభించారు.పాతర్లపహాడ్,కందగట్ల కొనుగోలుకేంద్రాల్లో 3000 బస్తాలు మాత్రమే కాంటావేశారు.ఏ ఒక్క కొనుగోలు కేంద్రాలలో నేటికీ కాంటాలు ప్రారంభించకపోవడం గమనార్హం.దీంతో రైతులు ఎప్పుడు అకాల వర్షాలు వస్తాయోనన్న భయంతో ఆందోళనకు గురవుతున్నారు.వ్యవసాయ అధికారులు తేమ పరిశీలన దాదాపు పూర్తి చేశారు.మండంలోని కందగట్ల, నెమ్మికల్, మంగలితండాలో కొనుగోలుకేంద్రాలను శనివారం తహసీల్దార్ పుష్ప పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం మంజుల, ఏఓ దివ్య, సీసీలు చందు, నగేష్ పాల్గొన్నారు.
నాగారం : మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం పడింది.అకాల వర్షానికి ధాన్యపు కొనుగోలుకేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. పస్తాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్స్తంభాలు కూలి జనం అస్తవ్యస్తం అయ్యారు.
అకాల వర్షాలు,పిడుగులతో రైతులు,ప్రజలు బెంబేలు
మద్దిరాల: శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం,పిడుగులతో మండల ప్రజలు బెంబేలు చెందారు. వివరాల్లోకి వెళితే మండలకేంద్రంతో పాటు రెడ్డిగుడెం, కుక్కడం ఆవాస ప్రాంతమైన దస్రు తండాలో శుక్రవారం రాత్రి పిడుగులు పడి జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కరెడ్డిగుడెం గ్రామంలోనే మూడు చోట్ల పిడుగులు పడి కొబ్బరిచెట్లు,తాటిచెట్లు దగ్దమయ్యాయి. పురోహితులు బండపల్లి విజయేందర్చారి ఇంట్లో వేపుగా పెరిగిన కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో గంటల తరబడి మంటలు చెలరేగాయి.అదేవిధంగా ఏనుగుతల శ్యాంబాబు వ్యవసాయ క్షేత్రంలో, దస్రుతండాలో దరావత్ సైదులు ఇంటి దగ్గర ఉన్న తాటిచెట్లపై పిడుగులు పడి భయాందోళనకు గురయ్యారని పలువురు అనుకుంటున్నారు.మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలుకేంద్రాలలో వరిధాన్యం తడిసి ముద్దైనసంఘటనలు చోటుచేసుకున్నాయి.వరి కోయని పొలాలు ఈదురుగాలులకు రాలిపోయాయని ఆవేదన చెందుతున్నారు.అదేవిధంగా మామిడి రైతులకు తీరని దుఃఖం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు.