Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు
- శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ తదితరులు
నవతెలంగాణ-నల్లగొండ
పవిత్ర రంజాన్ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లీంలు శనివారం సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లీం మత పెద్ద ఎహాసానుద్దీన్ ఆధ్వర్యంలో నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువరు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు హాజరై ముస్లీంలకు రంజాన్ ముబారక్ తెలిపారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వినరు కష్ణారెడ్డి, ఎస్పీ కే.అపూర్వరావు, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గుత్తా అమిత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, గుమ్మల మోహాన్‌రెడ్డి, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మెన్, 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు, పీస్ కమిటీ సభ్యులు హాఫీజాన్, సీపీఐ(ఎం) నాయకులు సయ్యద్ హశం సలీం, సత్తయ్య, బీఎస్పీ నాయకులు యాదయ్యతో పాటు వివిధ పార్టీల నాయకులు, ముస్లీం మత పెద్దలు హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను గౌరవించి నిర్వహిస్తుందన్నారు. అల్లా జిల్లా ప్రజలందరినీ దయతో చూడాలని కోరుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముస్లింల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు.
అయితే పార్టీల వైరాన్ని మరిచి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల నాయకులు అలరు బలరు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్టేజీపై ఉన్న సమయంలోనే భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రావడంతో ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకునే విధంగా తయారు కాగా పీస్ కమిటీ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి యుతంగా వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈద్గ వద్ద భారీ బందోబస్తు
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా వద్ద ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ నర్సింహారెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ రౌతు గోపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిర్యాలగూడ : రంజాన్ పండుగ వేడుకలు మిర్యాలగూడలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బంగారుగడ్డ ఈద్గా, రైల్వే స్టేషన్, అవంతిపురం ఈద్గాల వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలాది మంది ముస్లిం సోదరులు ఈద్గా వద్ద నమాజులు చేసి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కాంగ్రెస్ మున్సిపల్లో లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ముస్లిం సోదరులకు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అవంతిపురం ఈద్గాకు అభివద్ధి కోసం కోటి రూపాయలు నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే భాస్కరరావు ప్రకటించారు. మతసామరస్యానికి ప్రతికగా రంజాన్ పండుగని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, భావనల పాండు, రవి నాయక్, బాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మెన్ కుర్ర విష్ణు, కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, చిలుకూరి బాలు, మైనార్టీ నాయకులు వలిఉల్ల, హఫీజోద్దీన్ పాషా, ఫహిమోద్దీన్ పాల్గొన్నారు.
మతసామరస్యానికి, లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్న కాంగ్రెస్
నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్నగర్ : దేశంలో కాంగ్రెస్ మతసామరస్యానికి, లౌకికవాదానికి కట్టుబడి ఉందని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమకుమార్‌రెడ్డి అన్నారు.శనివారం స్థానిక ఈద్గా వద్ద ముస్లిం మైనార్టీ నాయకులు మరియు ముస్లిములతో రంజాన్ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు.పార్థనలో పాల్గొన్న ముస్లిములందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎరగాని నాగన్నగౌడ్, పట్టణ కార్యదర్శి తన్నీరు మల్లికార్జున్, జాయింట్సెక్రెటరీ ఎండి అజీజ్‌పాషా,ఎస్కె.మన్సూర్‌అలీ, రహీం, అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.