Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-మునుగోడు
ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని మే 1వ తేదీ నుండి7 వరకు మే డే వారోత్సవాలను వాడ వాడల ఘనంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ తెలిపారు. మునుగోడులో మేడే సన్నాక సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జీడిమెట్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కుల, మతాలకతీతంగా నిర్వహించుకునే ఏకైక పోరాట దినం మే డేను కార్మికులందరూ ఐక్యంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. గతం కంటే నేడు జరగబోయే మే డే ఉత్సవాలు ఒక ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నాయని, మోడీ ప్రభుత్వం దేశంలో మేడే విశిష్టతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుందని, విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలను కార్మిక వర్గం ముక్త కంఠంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు మండల నాయకులు రెడ్డిమల్ల యాదగిరి, నీరుడి రాజ్యలక్ష్మి, ఈశ్వరయ్య, అంజమ్మ,జి సుధాకర్, కిష్టయ్య, రాధిక, కవిత, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.