Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లులు, ఐకెేపీలను పరిశీలించిన డీిఎస్ఓ
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆదివారం మండలంలోని తుంగపాడులో ఉన్న గౌరు నారాయణ, వంశీ సాయి రైస్ మిల్లులను, తుంగపాడు త్రిపురారం పెద్దదేవులపల్లిలో ఐకేపీ కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏరోజుకారోజు ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతి చేసుకోవడంలో మిల్లర్లు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. మిల్లర్లు సకాలంలో ధాన్యం దిగుమతి చేసుకుంటున్నారని రైతులు అపోహలోకు గురి కాకుండా ప్రభుత్వ నిబంధనగానమునంగా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు తీసుకుంటున్నారని ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరారు. ధాన్యం ఎగుమతి కోసం లారీ డ్రైవర్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఐకేపీ కేంద్రాల వద్ద టర్పైన్లు అందుబాటులో ఉంచుకోవాలని, అకాల వర్షాలకు దాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డటీ రామకృష్ణారెడ్డి, ఆర్ఐలు సురేందర్ సింగ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.