Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూర్
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఐకెేపీ, వీఓఏలను సెర్ఫు ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి 26 వేల కనీస వేతనం వెంటనే అమలు చేయాలని కేవీపీస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకెేపీ వీఓఎల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె ఆదివారం ఏడవ రోజుకు చేరుకుంది. చండూరు మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ లో సుమారు 18 వేల మంది వివోఏలు గ్రామ సంఘాలకు సహాయకులుగా 19 సంవత్సరాల నుండి అనేక కష్టనష్టాలకోర్చిపని చేస్తున్నారని అన్నారు. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని వేతనాలు నేరుగా వివోఏ లో ఎకౌంట్లో వేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మోగదాల వెంకటేశం, పూలే అంబేద్కర్ జయంతి నియోజకవర్గ చైర్మన్ మలిగే యాదయ్య, అధ్యక్షుడు నారపాక ఆంజనేయులు, ఆసంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పి.యాదగిరి, మానుక ఆహల్యలిపెండ్యాల లలిత,మిట్టపల్లి అరుణ, లెంకల రాణి, బోయపల్లి అమృత, దొంతగాని శశికళ, జక్కలి యాదమ్మ, ఇడెం పుష్ప కుమారి, మాదగోని అరుణ, పాల్వాయి లక్ష్మి, సుగుణ, జెట్టి పద్మ, డోనాల కరుణ, నారపాక నిర్మల,ఎస్ లింగయ్య,, పులిజాల జ్యోతి, కవిత, నేర్లకంటి మోక్షారాణి తదితరులు పాల్గొన్నారు.