Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ఈ నెల 25 న నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లినరీని విజయవంతం చేయాలనీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్లినరీ సమావేశానికి ప్రతి గ్రామం నుంచి 30 నుంచి 50 మంది హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మెన్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చింతల సోమన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ చల్లా కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.