Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని 11వ వార్డులో రూ.50 లక్షలతో మహబూబ్నగర్ రోడ్డు నుంచి మిషన్ కాంపౌండ్ వరకు చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్ అలీ,స్థానిక కౌన్సిలర్ తస్కిన్ సుల్తానా, వేముల రాజు, పొన్నబోయిన సైదులు, తౌఫిక్ ఖాద్రీ, చిత్రం ప్రదీప్, బొడ్డుపల్లి కృష్ణ, ఇలియస్, ఏఈలు రాజు, శంకర్, ఐడీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.